- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహాకుంభమేళాకు వెళ్లిన టాలీవుడ్ హీరోయిన్.. అతడితో కలిసి స్నానం చేసే ఫొటోలు వైరల్
టాలీవుడ్ బ్యూటీ బిందు మాధవి(Bindu Madhavi) ‘బిర్యానీ’ (Biryani)సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటీ బిందు మాధవి(Bindu Madhavi) ‘బిర్యానీ’ (Biryani)సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. ఈ అమ్మడు రామ్ పోతినేని(Ram Pothineni) ‘రామ రామ కృష్ణ కృష్ణ’(Rama Rama Krishna Krishna) మూవీలోనూ నటించింది. అంతేకాకుండా పలు తమిళ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. కానీ పెద్దగా ఫేమ్ రాకపోవడంతో గత కొద్ది కాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అయితే ఇటీవల బిందు మాధవి రియాలిటీ షో బిగ్‌బాస్‌లో పాల్గొని విన్నర్‌గా కప్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
తాజాగా, బిందు మాధవి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కుంభమేళా(Kumbh Mela)కు వెళ్లింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్‌కు ఆమె ఇది ప్రీషియస్ మూమెంట్ అనే క్యాప్షన్ జత చేసింది. అక్కడ పుణ్యస్నానం ఆచరించింది. ప్రస్తుతం బిందు పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక అది చూసిన వారంతా నిజంగా కుంభమేళా ప్రీషియస్ మూమెంటే అని లవ్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.






