AK64 : అజిత్ కుమార్ నెక్ట్స్ ప్రాజెక్టులో టాలీవుడ్ హీరోయిన్.. పోస్టులు వైరల్

by Chukka Sudharani |

అజిత్ కుమార్ ప్రజెంట్ తన 64వ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

AK64 : అజిత్ కుమార్ నెక్ట్స్ ప్రాజెక్టులో టాలీవుడ్ హీరోయిన్.. పోస్టులు వైరల్
X

దిశ, సినిమా: అజిత్ కుమార్ ప్రజెంట్ తన 64వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ‘AK 64’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీకి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా అనౌన్స్ చెయ్యగా.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ‘AK 64’ ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

ఇప్పటికే ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, జీవి ప్రకాష్ భాగం కాగా.. ఇప్పుడు ఇందులో ఓ తెలుగు హీరోయిన్ అవకాశం అందుకున్నట్లు టాక్. AK64 లో ఓ ముఖ్యమైన పాత్ర కోసం టాలీవుడ్ నటి అంజలితో చర్చలు జరిపారట మేకర్స్. ఈ హీరోయిన్ రోల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుండగా.. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. కాగా.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో హిట్ అందుకున్న తర్వాత అజిత్ కుమార్ చేస్తున్న AK64 పై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. లింక్

Next Story