నిశ్చితార్థం బ్రేక్.. ఆగిపోయిన ప్రముఖ హీరోయిన్ పెళ్లి?

by Naga Rani Yarlagadda |

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఎంగేజ్మెంట్ ను బ్రేక్ చేసుకున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి.

నిశ్చితార్థం బ్రేక్.. ఆగిపోయిన ప్రముఖ హీరోయిన్ పెళ్లి?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఎంగేజ్మెంట్ ను బ్రేక్ చేసుకున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. పలు టాలీవుడ్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్ దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త రాజ్ హిత్ ఇబ్రన్ తో ఈ ఏడాది ఎంగ్మేజ్మెంట్ చేసుకుంది. ఇప్పుడీ పెళ్లి రద్దైనట్లు వార్తలొస్తున్నాయి.

నివేదా ఇటీవల తన ఎంగ్మెజ్మెంట్ ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో కూడా చేసుకున్నారు. కానీ పెళ్లి రద్దుపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. వ్యక్తిగత కారణాల వల్లే పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కాగా.. ప్రస్తుతం ఆమె సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. చిత్ర లహరి, రెడ్, పాగల్ తదితర సినిమాల్లో నివేదా నటించింది.

Next Story