TejaSajja: ‘యోగ పుట్టిన భూమిలో మనం పుట్టడం మన అదృష్టం’.. ఎల్బీ స్టేడియంలో అట్రాక్షన్‌గా నిలిచిన సినీ తారలు

by Kodari Anjali |

యోగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు మీ సొంతమవుతాయి.

TejaSajja: ‘యోగ పుట్టిన భూమిలో మనం పుట్టడం మన అదృష్టం’.. ఎల్బీ స్టేడియంలో అట్రాక్షన్‌గా నిలిచిన సినీ తారలు
X

దిశ, వెబ్‌డెస్క్: యోగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు మీ సొంతమవుతాయి. యోగా శరీరంలో ఆక్సిజన్‌ను మెరుగుపరుస్తుంది. హృదయ స్పందన రేటును కూడా తగ్గిస్తుంది. ఇది అధిక హృదయనాళ ఓర్పును కలిగిస్తుంది. యోగా అనేది నియంత్రిత శ్వాసను కలిగి ఉండటమే కాకుండా.. ఇది మీ ఊపిరితిత్తులను పూర్తి సామర్థ్యంతో నింపేలా చేస్తుంది. తద్వారా అవి మరింత సమర్థవంతంగా పని చేయడానికి వీలు కల్పిస్తుంది. అయితే నేడు యోగా దినం కాగా.. హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

ఇందులో పలువురు సినీ తారలు (టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి అండ్ తేజ సజ్జా), కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ, హీరోలు సాయి ధరమ్ తేజ్ కూడా హాజరయ్యారు. ఇక మీనాక్షి చౌదరి, తేజ సజ్జా హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని యోగా గురించి మాట్లాడారు. తేజ, మీనాక్షి యోగా చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తేజ సజ్జా ‘ ‘యోగ పుట్టిన భూమిలో మనం పుట్టడం మన అదృష్టం’’ అంటూ మాట్లాడాడు. నటుడి వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Next Story