- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైలెంట్‌గా పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ హీరో.. మ్యారేజ్ ఫొటోస్ షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వంత్(Viswant) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వంత్(Viswant) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌లో తెరకెక్కిన ‘కేరింత’(Kerintha) సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ కావడం, విశ్వంత్ నటనకు మంచి పేరు రావడంతో ఈ నటుడికి వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా మనమంతా, జెర్సీ, ఓ పిట్ట కథ, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, కథ వెనుక కథ, తోలు బొమ్మలాట, ఆ అమ్మాయి గురించి మీకు చెబుతా, బాయ్ ఫ్రెండ్ ఫర్ మైర్, మ్యాచ్ ఫిక్సింగ్, హైడ్ అండ్ సీక్ తదితర చిత్రాల్లో నటించి మెప్పించాడు.
అయితే తాజాగా ఈ నటుడు తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. బ్యాచిలర్ లైఫ్‌కు బై చెబుతూ భావన అనే అమ్మాయితో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. ఈ శుభవార్తను అతనే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. తన పెళ్లి ఫొటోలను షేర్ చేయడంతో అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఎలాంటి ముందస్తు ప్రకటన, హడావుడి లేకుండా ఈ జంట మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టడంతో అందరూ ఓకింత షాక్‌కు గురైతున్నారు.






