- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహా న్యూస్ ఛానల్ పై దాడి.. ఆ సమయంలో స్టూడియో లోపల టాలీవుడ్ హీరో
హైదరాబాద్‌లోని మహా న్యూస్ ఆఫీస్‌పై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని మహా న్యూస్ ఆఫీస్‌పై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్‌పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు మహా న్యూస్ కార్యాలయం పై దాడి చేశారు. ఆఫీస్ అద్దాలు, కార్లు, స్టూడియోను ధ్వంసం చేశారు. కార్యకర్తలు ఆఫీస్ లోకి ప్రవేశించి నిరసన వ్యక్తం చేశారు. ఈ మహా న్యూస్ కార్యాలయం పై దాడి సమయంలో టాలీవుడ్ నటుడు సుహాస్ ఆ స్టూడియోలోనే ఉన్నారు. ఆయన హీరోగా నటిస్తున్న సినిమా 'ఓ భామ అయ్యో రామ’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి మహా న్యూస్ చానెల్ కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో స్టూడియో పై ఒక్కసారిగా దాడి జరగడంతో భయాందోళనకు గురై.. ఇంటర్వ్యూ మధ్యలోనే ఆపేసి హీరో సుహస్‌ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆయనతో పాటు మూవీకి సంబంధించిన పలువురు ఉన్నట్లు సమాచారం. అయితే.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఛానెల్ పై దాడికి పాల్పడగా.. హీరో సుహాస్ ఈ ఘటనతో తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. ట్వీట్






