పోలీసుల అదుపులో టాలీవుడ్ హీరో.. కారణం ఏంటంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-18 02:23:31  IST  )

మంచు ఫ్యామిలీలో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.

పోలీసుల అదుపులో టాలీవుడ్ హీరో.. కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: మంచు ఫ్యామిలీలో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆస్తుల పంపకాల గురించి మొదలైన గొడవలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి తప్ప కొలిక్కి రావడం లేదు. అయితే సినీ నటుడు మంచు మోహన్ ఫ్యామిలీ గొడవలు రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాయి. మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ సోమవారం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతనికి టీడీపీ, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. మంచు మనోజ్ అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి గజమాలతో ఆహ్వానించారు.

అయితే.. తాజాగా మంచు మనోజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సినీ నటుడు మంచు మనోజ్‌ను తిరుపతి పోలీసులు సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆయనను బాకారావుపేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. ఈ తరుణంలో పీఎస్ వద్ద హీరో మనోజ్ అర్ధరాత్రి హల్‌చల్ చేశారు. స్థానిక ఓ రిసార్ట్‌లో ఆయన బస చేయగా అదే సమయంలో పెట్రోలింగ్ లో భాగంగా పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇక్కడెందుకు ఉన్నారంటూ వారు ఆయనను ప్రశ్నించడంతో మనోజ్ ఆగ్రహానికి గురయ్యారు. తనను అరెస్ట్ చేయడానికి వచ్చారా? అంటూ వాగ్వాదానికి దిగారు. అనంతరం పీఎస్ వద్దకు వెళ్లి నిరసన తెలిపినట్లు సమాచారం. మనోజ్ అరెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బాకారావుపేట పోలీసులు మరి కాసేపట్లో బయట పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Next Story