ప్రభాస్ ‘కల్కి 2898AD’ గెస్ట్‌ రోల్‌లో టాలీవుడ్ హీరో.. ఎవరో తెలుసా?

by Disha Web Desk 6 |
ప్రభాస్ ‘కల్కి 2898AD’ గెస్ట్‌ రోల్‌లో టాలీవుడ్ హీరో.. ఎవరో తెలుసా?
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ నాగవంశీ కాంబినేషన్‌లో ‘కల్కి2898AD’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో దీపికా పదుకొణె ప్రభాస్ సరసన నటిస్తుండగా.. కమల్ హాసన్, అమితాబ్, దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై పోస్టర్స్ గ్లింప్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే ఇటీవల ప్రభాస్ సలార్ మూవీతో హిట్ కొట్టడంతో ఫ్యాన్స్ చూపులన్నీ కల్కిపై పడ్డాయి.

ఈ మూవీ ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా, సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ విషయం తెలిసిన వారు మాత్రం నాగవంశీ రౌడీ హీరో లేకుండా సినిమా తీయడని అంటున్నారు.



Next Story

Most Viewed