ఎట్టకేలకు పెళ్లిపై స్పందించిన టాలీవుడ్ హీరో.. అప్పుడే చేసుకుంటానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

నవీన్ పొలిశెట్టి తన పెళ్లి డేట్‌తో పాటు సమయం కూడా చెప్పేసి షాక్ ఇచ్చాడు.

ఎట్టకేలకు పెళ్లిపై స్పందించిన టాలీవుడ్ హీరో.. అప్పుడే చేసుకుంటానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) న‌టిస్తున్న తాజా చిత్రం అన‌గ‌న‌గా ఒక రాజు (Anaganaga Oka Raju). ఈ సినిమాకు మారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్‌ కో ప్రొడ్యూస్ చేస్తుంది.

మిక్కీ జే మేయర్‌(Mickey J Meyar) మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. అయితే ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా.. జ‌న‌వరి 14న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ పై పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటూ మూవీపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన “పెళ్లి రిసెప్షన్” ఈవెంట్‌లో పాల్గొన్న నవీన్ పొలిశెట్టి మీడియా వారు అడిగిన ప్రశ్నలకు చమత్కారంగా సమాధానాలు ఇచ్చారు.

పెళ్లి గురించి ఎప్పటి నుంచో వస్తున్న వార్తలను ఎప్పుడు నిజం చేస్తారు? అని మీడియా అడగగా.. “ప్రభాస్ ఏ రోజైతే పెళ్లి చేసుకుంటారో, ఆ మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు నేను పెళ్లి చేసుకుంటా” అంటూ ఫన్నీగా జవాబు ఇచ్చారు. దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగా నవ్వసాగారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story