- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త మూవీ అనౌన్స్ చేసిన టాలీవుడ్ హీరో.. ‘బ్రోకెన్ సోల్.. ఆన్ ఎ బ్రూటల్ సెలబ్రేషన్ అంటూ ప్రీలుక్ పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. కానీ స్టార్ హీరోగా రాణించలేక పోతున్నాడు. దీంతో మంచి హిట్ కోసం బాగా కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో నేడు మరో కొత్త మూవీను అనౌన్స్ చేశాడు. ఈరోజు హీరో సుధీర్ బాబు బర్త్‌డే కాబట్టి ఈ సందర్భంగా తన కొత్త మూవీ నుంచి ప్రీలుక్ పోస్టర్‌ను మూవీటీమ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక ఆ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘గాయపడ్డాను కానీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను.. మా ప్రొడక్షన్ నెంబర్ 51ని ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉంది. మా నవ దళపతికి శుభాకాంక్షలు.. #PMFxSB తో క్రూరమైన వేడుక వేచి ఉంది’ అని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ చిత్రానికి ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, క్రితి ప్రసాద్‌లు నిర్మిస్తున్నారు.
ఇక పోస్టర్‌లో.. మెట్ల మీద కుప్పలు తెప్పలుగా పడి ఉన్న శవాలు, వాటి మధ్య షర్టు లేకుండా, చేతిలో ఆయుధంతో నడుస్తున్న హీరో. ‘బ్రోకెన్ సోల్.. ఆన్ ఏ బ్రూటల్ సెలబ్రేషన్’ అనేది క్యాప్షన్. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇక ఈ మూవీతో అయినా సుధీర్ మంచి హిట్ సాధిస్తాడేమో చూడాలి.






