- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో.. వైరల్‌గా మారిన పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ‘బాహుబలి’(Bahubali) సినిమాతో ఏకంగా స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ప్రస్తుతం నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మిస్తున్నాడు. అలా నిర్మాతగా సక్సెస్ అవుతున్నారు. ఇక అతని వ్యక్తిగత విషయానికి వస్తే.. రానా.. మిహికా(Mihika) అనే అమ్మాయిని 2020 ఆగస్టు 8న పెళ్లి చేసుకున్నాడు. కరోనా సమయంలో వీరి పెళ్లి జరగడంతో పెద్దగా ప్రముఖులు ఎవరు హాజరు కాలేదు.
వివాహం జరిగినప్పటి నుండి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ వస్తూ ఉన్నారు. అయితే ఆ మధ్య మిహికా ప్రగ్నెంట్ అని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మరోమారు ఈ వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా మిహిక తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో స్టమక్ మీద హ్యాండ్ వేసి ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఇక ఈ పిక్‌కు.. ‘ జస్ట్ ఫెల్ట్ లైక్ ఇట్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మిహిక ప్రెగ్నెంట్ అని, రానా తండ్రి కాబోతున్నాడని ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరి దీనిపై ఈ జంట స్పందించాల్సి ఉంది.






