- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tollywood: గ్రాఫిక్స్ కష్టాలు.. ఇబ్బందుల్లో ఆ రెండు క్రేజీ చిత్రాలు
‘విశ్వంబర’, ‘స్వయంభు’ చిత్ర బృందాలు అద్భుతమైన విజువల్ ఔట్‌పుట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతోనే విడుదల తేదీల విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేదని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమ స్థాయి రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. దాంతో నిర్మాతలు కూడా భారీ బడ్జెట్‌తో సినిమాలు రూపొందించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ నుంచి భారీ గ్రాఫిక్స్ చిత్రాలు అనేకం వస్తున్నాయి. అయితే అందులో ఒకటి, రెండు మినహా మిగతా సినిమాలు పెద్ద స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. దానికి ప్రధాన కారణం తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే వరల్డ్ సినిమాలకు అలవాటు పడడమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ భాషల సినిమాలను చూస్తూ ఉండటంతో, నాసిరకం గ్రాఫిక్స్ ప్రేక్షకులకు నచ్చడం లేదని చెబుతున్నారు.
అందుకే అద్భుతమైన విజువల్ వండర్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే ఖచ్చితంగా వారు అలాంటి చిత్రాలను ఆదరిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో భారీ వీఎఫ్‌ఎక్స్‌తో రూపొందుతున్న చిత్రాల్లో విశ్వంబర, స్వయంభు ముందు వరుసలో ఉన్నాయి. ఈ రెండు చిత్రాలను కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలు ప్రారంభమై చాలా కాలం గడిచినా, విడుదల విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంబర’ చిత్రాన్ని గత సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ భాగం చాలా ఎక్కువగా ఉండడంతో విడుదల పదేపదే వాయిదా పడుతోంది. ప్రస్తుతం ఈ సినిమాను జూలై 10న విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
అయితే మొత్తం ఔట్‌పుట్ వచ్చాక, అది సంతృప్తికరంగా ఉంటేనే ఆ తేదీన విడుదల చేయాలని, లేదంటే మరికొన్ని రోజులు సమయం తీసుకున్నా సరే అద్భుతమైన ఔట్‌పుట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రూపొందుతున్న ‘స్వయంభు’ పరిస్థితి కూడా దాదాపు ఇదే విధంగా ఉంది. ఈ సినిమాను మే 22న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నప్పటికీ, ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి ఔట్‌పుట్ వచ్చిన తర్వాతే అధికారికంగా విడుదల తేదీని ప్రకటించాలని మూవీ బృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలా ఈ రెండు చిత్రాలు అద్భుతమైన విజువల్ ఔట్‌పుట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతోనే విడుదల తేదీల విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేదని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.






