కొంపల్లిలో కొత్త బ్రాంచ్ ప్రారంభించిన వీరికి శుభాకాంక్షలు చెబుతూ టాలీవుడ్ దర్శకధీరుడు పోస్ట్

by Kodari Anjali |

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

కొంపల్లిలో కొత్త బ్రాంచ్ ప్రారంభించిన వీరికి శుభాకాంక్షలు చెబుతూ టాలీవుడ్ దర్శకధీరుడు పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఆల్మోస్ట్ ఈ డైరెక్టర్ తెరకెక్కించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినవే. దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి అంటే మనకు అగ్ర హీరోలు, భారీ బడ్జెట్ మూవీలే గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించి బాహుబలి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి.. మంచి హిట్ అందుకున్నారు. దీంతో పాటుగా డబుల్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కించి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి ప్రముఖ హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబుతో జతకట్టారు.

రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ మూవీ కోసం సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే.. జక్కన్న అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఈ దర్శకధీరుడు ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఆహార రుచి, నాణ్యత అసాధారణంగా బాగున్నాయి. మీరు ఈ ప్రమాణాన్ని కొనసాగిస్తే, మాయాబజార్ ఖచ్చితంగా హైదరాబాద్‌లోని అగ్రశ్రేణి రెస్టారెంట్లలో ఒకటిగా మారుతుంది. కొంపల్లిలో కొత్త బ్రాంచ్ కోసం నిక్కీ, శశాంక్‌లకు శుభాకాంక్షలు’’ అని క్యాప్షన్ రాసుకొచ్చారు.

Next Story