స్టార్ కిడ్ సినిమా ‘సీతా పయనం’ టీజర్ లాంచ్‌కు గెస్ట్‌గా టాలీవుడ్ డైరెక్టర్.. పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-14 15:18:53  IST  )

స్టార్ హీరో అర్జున్ సర్జా(Arjun Sarja) ‘సింహాద మరి సైన్య’ మూవీతో ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

స్టార్ కిడ్ సినిమా ‘సీతా పయనం’ టీజర్ లాంచ్‌కు గెస్ట్‌గా టాలీవుడ్ డైరెక్టర్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: స్టార్ హీరో అర్జున్ సర్జా(Arjun Sarja) ‘సింహాద మరి సైన్య’ మూవీతో ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన దర్శకుడిగా కూడా మారి హిట్స్ అందుకున్నారు. అయితే ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య (Aishwarya)కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం రెండు సినిమాలే చేసినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక గత ఏడాది కమెడియన్ తంబి రామయ్య కొడుకును పెళ్లాడింది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. అర్జున్ సర్జా దర్శకత్వంలో వస్తున్న ‘సీతా పయణం’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.

సత్యరాజ్, ప్రకాష్ రాజ్, నిరంజన్, జగపతి బాబు, కోవై సరళ కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, మూవీమేకర్స్ ‘సీతా పయనం’(SeethaPayanam ) నుంచి టీజర్ రాబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ వేడుక మే 28న AAA సినిమాస్‌లో జరగనుండగా.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, స్టార్ హీరో ఉపేంద్ర ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుపుతూ పోస్టర్‌ను కూడా చిత్రబృందం షేర్ చేసింది.

Next Story