రీరిలీజ్ సినిమా కోసం.. మొత్తం ఇండస్ట్రీ కదిలింది!

by Gantepaka Srikanth |

తెలుగు సినిమా చరిత్రలో అక్కినేని నాగార్జున - రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన శివ సినిమాకు సపరేట్ క్రేజ్ ఉంటుంది.

రీరిలీజ్ సినిమా కోసం.. మొత్తం ఇండస్ట్రీ కదిలింది!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమా చరిత్రలో అక్కినేని నాగార్జున - రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన శివ సినిమాకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఈ సినిమా మా జీవితాల్నే మార్చేసిందని అనేకమంది హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, యాక్టర్లు బహిరంగంగానే చెబుతుంటారు. తాజాగా ఈ సినిమాను ఈనెల 14న రీరిలీజ్ చేస్తున్నారు. నాగార్జున టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రంలో ఆయనకు జోడీగా అమల నటించారు. శుభలేఖ సుధాకర్, రఘువరన్, తనికెళ్ల భరణి, జేడీ చక్రవర్తి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు.

అయితే.. ఈ సినిమా రీరిలీజ్ కాబోతున్న తరుణంలో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సినిమాకు విషెస్ చెప్పడంతో పాటు సినిమా వారిపై ఎలా ప్రభావం చూపిందో చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, నాని సహా పలువురు వీడియోలు రిలీజ్ చేశారు. వీడియో

Next Story