- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి కూతురు గెటప్‌లో దర్శనమిచ్చి షాకిచ్చిన టాలీవుడ్ బ్యూటీ.. ఏంజెల్ అంటూ నెటిజన్ల కామెంట్స్
పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ‘ఆర్‌ఎక్స్100’ చిత్రంతో పరిచయం అయిన తన అందం, అభినయం నటనతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.

దిశ, సినిమా: పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ‘ఆర్‌ఎక్స్100’ చిత్రంతో పరిచయం అయిన తన అందం, అభినయం నటనతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో అమ్మడుకి వరుస అవకాశాలు వచ్చాయి. పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన పాయల్ ‘మంగళవారం’(Mangalavaaram) హిట్ అందుకుంది. గత ఏడాది ‘రక్షణ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం పాయల్ ఓ పాన్ ఇండియా మూవీతో రాబోతుంది. ఏకంగా 6 భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ‘వెంకటలచ్చిమి’(Venkata Lachimi) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దీనిని ముని తెరకెక్కిస్తుండగా.. రాజా, ఎన్‌ఎస్ చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ పాయల్ నెట్టింట వరుస పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, ఈ అమ్మడు ఎల్లో కలర్ లెహంగాలో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. నగలు ధరించి గార్జియస్ లుక్‌లో మెరిసిపోతూ కనిపించింది. ఈ పోస్ట్‌కు ‘నేను ఏంజెల్‌ను కాదు’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇందులో ఆమె పెళ్లి కూతురిగా రెడీ అయి అందరికీ షాకిచ్చింది. వధువులా దుపట్టాను తలపై వేసుకోవడంతో అంతా పెళ్లి చేసుకోబోతుందని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం పాయల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన వారంతా ఏంజెల్, సో బ్యూటిఫుల్, సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు.






