డైరెక్టర్స్ నన్ను సరిగ్గా వాడుకోవట్లేదు.. ఫీల్ అవుతున్నానంటూ ఐకాన్ స్టార్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-14 11:04:24  IST  )

కేథరిన్(Catherine Tresa) ‘చమ్మక్ చల్లో’ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ‘ఇద్దరమ్మాయిలు’ (Iddarammayilatho) మూవీతో విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది.

డైరెక్టర్స్ నన్ను సరిగ్గా వాడుకోవట్లేదు.. ఫీల్ అవుతున్నానంటూ ఐకాన్ స్టార్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: కేథరిన్(Catherine Tresa) ‘చమ్మక్ చల్లో’ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ‘ఇద్దరమ్మాయిలు’ (Iddarammayilatho) మూవీతో విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఆ తర్వాత సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించిన కేథరిన్ అనతి కాలంలోనే ఫుల్ క్రేజ్‌ను సొంతం చేసుకుని కొద్ది కాలం పాటు ఇండస్ట్రీలో రాణించింది. ప్రస్తుతం కేథరిన్ ‘ఫణి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇందులో మహేష్ శ్రీరామ్(Mahesh Sriram) హీరోగా నటిస్తుండగా. ఓఎం.జీ ప్రొడక్షన్స్ ఏయూ అండ్ ఐ స్టూడియోల సమర్పణలో మీనాక్షి నిర్మిస్తోంది.

వి.ఎన్ ఆదిత్య(V.N. Aditya) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేథరిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నటిగా నన్ను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని నేను ఫీల్ అవుతున్నా. గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా నేను ఇంకా చాలా చేయగలను. నా ఇమేజ్‌ను దాటి ఫర్ఫార్మ్ చేయడానికి నాకు ఇప్పటి వరకు ఎలాంటి అవకాశం రాలేదు. నాలో చాలా సామర్థ్యం ఉందని నేను నమ్ముతున్నాను. నేను లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించాలని అనుకుంటున్నాను. అలా అయితే నా నా నటనా సామర్థ్యాన్ని పూర్తిగా చూపించే అవకాశం ఉంటుంది’’ అని చెప్పుకొచ్చింది.

Next Story
null