టాలీవుడ్ లో మ‌రో విషాదం..నటి జయవాహిని కన్నుమూత ?

by velandi.Saikiran |   (  Updated:2026-02-05 00:45:28  IST  )

నటి జయ వాహిని ( Jaya Vahini) కన్నుమూశారని తెలుస్తోంది. హైదరాబాద్ మణికొండలోని తన సొంత ఇంటిలోనే మృతి చెందారట.

టాలీవుడ్ లో మ‌రో విషాదం..నటి జయవాహిని కన్నుమూత ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు మరణించగా, తాజాగా మరో టాలీవుడ్ నటి మృతి చెందారు. ఒకప్పుడు సీరియల్స్, సినిమాలలో కీలక పాత్రలు పోషించిన నటి జయ వాహిని ( Jaya Vahini) కన్నుమూశారని తెలుస్తోంది. హైదరాబాద్ మణికొండలోని తన సొంత ఇంటిలోనే మృతి చెందారట. చాలా రోజుల నుంచి జయ వాహిని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాధి విషమించిన నేపథ్యంలో చికిత్స పొందుతూ జయ వాహిని మరణించినట్లు సమాచారం అందుతోంది.

అయితే జయ వాహిని మృతి చెందిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలోని స్వస్థల గ్రామానికి తరలించారట కుటుంబ సభ్యులు. వాస్తవంగా జయ వాహిని సొంత ఊరు స్వస్థల అని తెలుస్తోంది. అక్కడే జయ వాహిని అంతక్రియలు చేయబోతున్నారట. ఇవాళ సాయంత్రం లోగా జయ వాహిని అంతక్రియలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. జయ వాహిని మరణించినట్లు మొదటగా కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

ఎమోషనల్ అయిన కరాటే కళ్యాణి

టాలీవుడ్ సీనియర్ నటి జయ వాహిని మృతి చెందిన నేపథ్యంలో కరాటే కళ్యాణి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. పద్మక్క.. నిన్ను కాపాడడానికి చాలా ప్రయత్నం చేశాం... కానీ నిన్ను దక్కించుకోలేకపోయామని వెల్లడించారు. నీ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు కరాటే కళ్యాణి. జయ వాహినిని ముద్దుగా పద్మక్క అని పిలుస్తూ ఉంటుందట కరాటే కళ్యాణి. ఇక అటు సినిమాలలో కీలక పాత్రలు పోషించిన నటి జయ వాహిని ( Jaya Vahini) మృతి చెందార‌ని వార్త‌లు రాగానే, సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలుపుతున్నారు. కాగా, తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాకుండా, త‌మిళం కూడా చాలా సీరియ‌ల్స్ మెరిసారు నటి జయ వాహిని. అయితే, రొమ్ము క్యాన్స‌ర్ సోక‌గానే, ఇండ‌స్ట్రీకి దూరం అయ్యారు.


Next Story