ఆత్మహత్యకు సిద్ధమైన టాలీవుడ్ నటి.. చివరికి రోడ్డుపై అలాంటి స్థితిలో!

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ నటి పావల శ్యామల తీవ్రమైన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. సుమారు 300 తెలుగు చిత్రాలలో నటించిన శ్యామల ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉన్నారు.

ఆత్మహత్యకు సిద్ధమైన టాలీవుడ్ నటి.. చివరికి రోడ్డుపై అలాంటి స్థితిలో!
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి పావల శ్యామల తీవ్రమైన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. సుమారు 300 తెలుగు చిత్రాలలో నటించిన శ్యామల ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉన్నారు. శ్యామలతో పాటు ఆమె కుమార్తె తీవ్ర అనారోగ్యానికి గురవ్వగా ప్రస్తుతం ఆమె ఉంటున్న ఓల్డేజ్ హోమ్ నిర్వాహకులు రోడ్డుపై వదిలిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్యామల రోడ్డుపై ఆత్మహత్యకు సిద్దమవ్వగా వారిని కార్ఖానా పోలీస్ స్టేషన్ సిబ్బంది గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని తిరుమలగిరి ఏసీపీ రమేశ్ దృష్టికి తీసుకెళ్లారు.

తక్షణమే స్పందించిన ఏసీపీ, వారిని కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ హెల్త్‌కేర్ సెంటర్‌కు తరలించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రామకృష్ణ వారికి ఆశ్రయం కల్పించి, అవసరమైన అన్ని సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. తమ సంస్థ ద్వారా అనాథ వృద్ధులకు సాయం అందిస్తున్నామని, ఎవరైనా అవసరంలో ఉంటే 9866491506 నంబర్ ద్వారా తనను సంప్రదించాలని రామకృష్ణ‌ కోరారు. ఇదిలా ఉంటే శ్యామ‌ల చాలా కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే కొంత‌మంది సినిమావాళ్లు సాయం చేసినా అంతంత‌మాత్ర‌మే అని చెప్పాలి. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటివాళ్లు చొర‌వతీసుకుని న‌టిని ఆదుకోవాల‌ని నెటిజ‌న్లు కోరుతున్నారు.

Next Story