- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆల్ ది బెస్టు.. నెత్తిన జిలకర బెల్లం పెట్టు’.. మరోసారి మెస్మరైజ్ చేస్తున్న రామ్ మిరియాల సాంగ్
‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్

దిశ, సినిమా: 'చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే', 'టిల్లు అన్న డీజే పెడితే..', 'ఛమ్కీల అంగీలేసి..', 'ఊరు పల్లెటూరు..'.. వంటి ఎన్నో సాంగ్స్‌తో మ్యూజిక్ లవర్స్‌కు ఫేవరేట్‌గా మారిపోయిన వెర్సటైల్ సింగర్ రామ్ మిరియాల.. ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా టైటిల్ సాంగ్ పాడారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేశారు. 'సంతాన ప్రాప్తిరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు... సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ, ఆల్ ది బెస్టు, నెత్తిన జిలకర బెల్లం పెట్టు, మంగళసూత్రం మెళ్లోన కట్టు, లక్షలు వోసి దావత్ వెట్టు, కొత్తగ వేరే కాపురమెట్టు, నీదేమో నైట్ షిఫ్టు, నీ వైఫుది మార్నింగ్ షిఫ్టు, వీకెండ్‌లో రొమాన్స్ కు ప్లానింగ్ చేసి లెక్కలుగట్టు...' అంటూ ప్రస్తుత కాలంలో యూత్ మ్యారీడ్ లైఫ్ స్టైల్‌ను చూపిస్తూ సాగుతున్న ఈ సాంగ్ ప్రజెంట్ ఆకట్టుకుంటుంది. కాగా.. విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న "సంతాన ప్రాప్తిరస్తు" సినిమాను మధుర ఎంటర్‌టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్ మధ్య ఈ మూవీ ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం.






