‘రాపో-22’ నుంచి టైటిల్ గ్లింప్స్ రాబోతున్నాయి.. వన్ ఫ్యాన్, వన్ షో, మిలియన్ ఎమోషన్స్ అంటూ పోస్టర్ రిలీజ్

by Kavitha |   ( Updated:2025-05-09 03:50:09.0  )
‘రాపో-22’ నుంచి టైటిల్ గ్లింప్స్ రాబోతున్నాయి.. వన్ ఫ్యాన్, వన్ షో, మిలియన్ ఎమోషన్స్ అంటూ పోస్టర్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: లవర్ బాయ్ రామ్ పోతినేని (Ram pothineni) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాపో-22’(Rapo-22). అయితే దీనికి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు పి (Mahesh Babu) దర్శకత్వం వహిస్తుండగా.. టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్ పై నవీన్ ఎర్నేని(Naveen Yerneni), వై. రవిశంకర్‌(Y. Ravi Shanker)లు నిర్మిస్తున్నారు. ఇక ఈచిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sree Borse) హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే మే 15న రామ్ పోతినేని పుట్టినరోజు. దీంతో ఆయన కొత్త సినిమా టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేయడంతో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘వన్ ఫ్యాన్, వన్ షో, మిలియన్ ఎమోషన్స్.. రాపో నుంచి టైటిల్ గ్లింప్స్ మే 15న రాబోతుంది’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.



Next Story

Most Viewed