నిర్మాతగా మారిన కిరణ్ అబ్బవరం.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ సింగిల్

by Sujitha Rachapalli |

ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలబడుతూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". సుమైరా స్టూడియోస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద

నిర్మాతగా మారిన కిరణ్ అబ్బవరం.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ సింగిల్
X

దిశ, సినిమా : హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఆహ్లాదకరమైన పల్లె వాతావరణంలో చిత్రీకరించిన ‘చిన్ని చిన్ని గుండెలోన’ అంటూ సాగే మెలోడీ సాంగ్ ఆకట్టుకుంటోంది. ‘చిన్ని చిన్ని గుండెలోన చాలా ప్రేమే దాచిన.. దబాయించి దొంగోడా దోచుకుపోలేవా.. చిందే చిందే ఈడులోన ఏకాంతాలే యాతన.. మీసాలున్న మొనగాడా జంటకు రాలేవా..’ అంటూ సాగే పాటకు వంశీకాంత్ రేఖన క్యాచీ ట్యూన్‌తో కంపోజ్ చేయగా.. సనరే లిరిక్స్ అందించారు. హరిణి ఇవటూరి, పవన్ కల్యాణ్ ఈ పాటను ఆలపించారు. వి. మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ద్వారా సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా ఇంట్రడ్యూజ్ కాబోతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Next Story