Rajinikanth: రజినీకాంత్ ‘కూలీ’ మూవీ టీజర్ విడుదలకు టైమ్ ఫిక్స్.. ట్వీట్ వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2025-03-04 10:30:21  IST  )

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’(Coolie).

Rajinikanth: రజినీకాంత్ ‘కూలీ’ మూవీ టీజర్ విడుదలకు టైమ్ ఫిక్స్.. ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’(Coolie). ఈ పాన్ ఇండియా సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్(Kalanidhi Maran) నిర్మిస్తున్నారు. అయితే ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(Nagarjuna), శృతి హాసన్, సత్యరాజ్, మంజుమ్మెల్ బాయ్స్ ఫేమ్ సాబిన్ షాహిద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde) కూడా ఇందులో ఓ ప్రధాన పాత్రలో నటించనుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ఈ మూవీ రజినీకాంత్ 171వ సినిమా కావడంతో అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ‘కూలీ’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్రమ రవాణా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 10వ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘కూలీ’ అప్డేట్ రాబోతున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మూవీ టీజర్ మార్చి 14న లోకేష్ కనగరాజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతున్నట్లు సమాచారం.

Next Story