- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rapo-22: మీకు సుపరిచితుడు.. మీలో ఒకడు.. రామ్-మహేష్ బాబు సినిమా అప్డేట్‌కు టైమ్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) నటిస్తున్న తాజా చిత్రం ‘రాపో-22’(Rapo-22). దీనికి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ పీ మహేష్ బాబు(Mahesh Babu) దర్శకత్వం వహిస్తున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) నటిస్తున్న తాజా చిత్రం ‘రాపో-22’(Rapo-22). దీనికి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ పీ మహేష్ బాబు(Mahesh Babu) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే(Bhagya Shri Borse) హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే మైత్రీ మైవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యాక్రమం ఇటీవల జరిగింది. ఇక అప్పటి నుంచి ‘రాపో-22’ మూవీ మేకర్స్ ఏదో ఒక అప్డేట్ విడుదల చేస్తూ అంచనాలను పెంచుతున్నారు.
తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 6న ఉదయం 10: 08 గంటలకు రాబోతున్నట్లు తెలిపారు. అలాగే ‘‘మీకు సుపరిచితుడు.. మీలో ఒకడు మీ ముందుకు రాబోతున్నాడు అతనిని కలుసుకోండి’’ అనే క్యాప్షన్ జత చేశారు. అంతేకాకుండా సైకిల్ తొక్కుతున్న హీరో పోస్టర్‌ను సగభాగం షేర్ చేసి క్యూరియాసిటీ(Curiosity)ని పెంచారు. ఇక ఈ పోస్ట్ చూసిన రామ్ పోతినేని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మీకు సుపరిచితుడు... మీలో ఒకడు ..✨
— BA Raju's Team (@baraju_SuperHit) December 5, 2024
Introducing the One Among You from #RAPO22 on December 6th at 10:08 AM 🤩@ramsayz @bhagyasriiborse @filmymahesh @MythriOfficial @iamviveksiva @mervinjsolomon @sreekar_prasad #MadhuNeelakandan @artkolla #RAPO pic.twitter.com/eQa1p28iUt






