Kamal Haasan: ‘థగ్‌లైఫ్’ ట్రైలర్ రిలీజ్.. అంచనాలను పెంచుతున్న కమల్ హాసన్ యాక్షన్-ప్యాక్డ్ సీన్స్..

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-02 15:24:22  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan), మణిరత్నం కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ ‘థగ్‌లైఫ్’.

Kamal Haasan: ‘థగ్‌లైఫ్’ ట్రైలర్ రిలీజ్.. అంచనాలను పెంచుతున్న కమల్ హాసన్ యాక్షన్-ప్యాక్డ్ సీన్స్..
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan), మణిరత్నం కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ ‘థగ్‌లైఫ్’. 36 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఇందులో త్రిష, సన్యా మల్హోత్రా(Sanya Malhotra), ఐశ్వర్య లక్ష్మీ(Aishwarya Lakshmi) హీరోయిన్లుగా నటించగా.. స్టార్ హీరో శింబు(Simbu), నాజర్, జోజూ జార్జ్, గౌతమ్ కార్తీక్ కీలక పాత్రలో కనిపించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 5న థియేటర్స్‌లోకి రానుంది.

ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ జోరు పెంచారు. ‘థగ్‌లైఫ్’ వరస అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. నిత్యం ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ టీమ్ ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. ఇక గత కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా ఈ మూవీకి సంబంధించిన విషయాలే దర్శనమిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. అయితే మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో రాబోతున్న చిత్రం కావడంతో అందరిలో మరింత ఆసక్తి పెరిగింది.

ఇదిలా ఉంటే.. తాజాగా, ‘థగ్‌లైఫ్’ మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేశారు. ఇందులో కమల్ హాసన్ గ్యాంగ్ స్టర్‌గా నటించగా.. యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. అయితే కమల్ ప్రాణం కాపాడటంతో శింబు పెంచుతాడు. మొత్తానికి ఆయనకు రైట్ హ్యాండ్‌గా పని చేస్తాడు. కానీ చివరకు వీరిద్దరి మధ్య వైరం ఏర్పడుతుంది.ఈక్రమంలోనే కమల్ ఎక్కడికో వెళ్లిపోతారు.. మళ్లీ తిరిగి వచ్చాక నువ్వా.. నేనా అనే విధంగా పోరాటం మొదలుపెడతారు. ఆ తర్వాత ఏం జరిగింది అసలు వీరిద్దరు కలుసుకున్నారా? లేదా అనేది స్టోరీ అన్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో కమల్ హాసన్, త్రిషతో రొమాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొత్తానికి ‘థగ్‌లైఫ్’(Thuglife) ట్రైలర్ అంచనాలను పెంచుతోంది. ఇక అది చూసిన వారంతా హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు

Click For Video....

Next Story