- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తుడరుమ్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. అదిరిపోయే పోస్టర్ షేర్ చేసిన మోహన్‌లాల్
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్(Mohanlal) వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు.

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్(Mohanlal) వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు. అయితే ఇటీవల ఆయన ‘L2: ఎంపురాన్’ (L2: Empuran)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. అంతే రేంజ్‌లో విమర్శలను కూడా ఎదుర్కొంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, మోహన్‌లాల్ కొత్త సినిమాను ప్రకటించారు.
తరుణ్‌మూర్తి(Tarun Murthy) దర్శకత్వంలో రాబోతున్న ‘తుడరుమ్’ విడుదలకు సిద్ధం అయినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది జనవరి నెలలో విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో మరోసారి వాయిదా పడిందని పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. మోహన్ లాల్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘‘మీరందరూ గత కొన్ని రోజుల నుంచి ‘తుడరుమ్’ విడుదల విషయంలో వింటున్న రూమర్స్‌లో నిజం లేదు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 25న థియేటర్స్‌లోకి రానుంది’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా కారు పక్కన పంచెకట్టులో నిల్చొని ఉన్న పోస్టర్‌నుషేర్ చేశారు. ప్రస్తుతం మోహన్‌లాల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రూమర్స్‌కు చెక్ పడేలా చేసింది.






