- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sundeep Kishan: థ్రిల్లర్ యాక్షన్ రైడ్ లోడింగ్.. హీరో బర్త్ డే స్పెషల్ ‘SK-31’ నుంచి స్పెషల్ వీడియో షేర్ చేసి హైప్ పెంచిన మేకర్స్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) గత ఏడాది రాయన్, ఊరు పేరు భైరవకోన వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(sundeep Kishan) గత ఏడాది రాయన్, ఊరు పేరు భైరవకోన వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఇక ఇటీవల ఆయన ‘మజాకా’(Mazaka) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 26న థియేటర్స్‌లో విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం సందీప్ కిషన్ ఓ భారీ ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు. అయితే ఈ సినిమాను దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్(Jason Sanjay) తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంతోనే ఆయన ఇండస్ట్రీకి పరిచయం కాబోతుండటం విశేషం. ఇక ఈ మూవీని అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్(Lyca Production) బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే నేడు సందీప్ కిషన్ పుట్టినరోజు కావడంతో మూవీ మేకర్స్ అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. షూటింగ్’కు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. డైనమిక్ సందీప్ కిషన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు! మీ ప్రత్యేకమైన శైలి సినిమా పట్ల మక్కువ ప్రతి పాత్రలోనూ ప్రకాశిస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్స్ అంతులేని ఆనందంతో నిండిన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాం’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ వీడియోలో యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి. అది చూసిన వారంతా థ్రిల్లర్ యాక్షన్ రైడ్ లోడింగ్ అని కామెంట్లు పెడుతున్నారు.






