- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rajamouli: ‘మహాభారత’ కోసం ముగ్గురు టాలీవుడ్ స్టార్స్.. రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా.. హైప్ పెంచుతున్న ట్వీట్..
టాలీవుడ్ ధర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) ఈగ, బాహుబలి, మగధీర(Magadheera) వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా స్టార్ డైరెక్టర్‌గా ఫేమ్ తెచ్చుకున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ ధర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) ఈగ, బాహుబలి, మగధీర(Magadheera) వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా స్టార్ డైరెక్టర్‌గా ఫేమ్ తెచ్చుకున్నారు. ఇక 2022లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు సినిమా చరిత్రను ఏకంగా ఆస్కార్ వరకు తీసుకెళ్లారు. ఈ చిత్రానికి పలు విభాగాల్లో ఆస్కార్ అవార్డు రావడంతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘SSMB-29’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానప్పటికీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంతో పాటు రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తున్న ‘మహాభారత’ (Mahabharata)సినిమాను కూడా తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు.
దీంతో ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో ఎవరు నటిస్తారనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో.. తాజాగా, సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో రీపీటెడ్‌గా సినిమాలు చేసిన రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టు కోసం ఓ ముగ్గురు హీరోలను తీసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. కృష్ణుడి పాత్ర కోసం ఎన్టీఆర్.. కర్ణుడి పాత్ర కోసం రామ్ చరణ్(Ram Charan) తీసుకోబోతున్నట్లు టాక్. వీరిద్దరితో పాటు ఈ సినిమాలో నేచురల్ స్టార్ నానిని కూడా కీలక పాత్ర చేసేందుకు రాజమౌళి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతూ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రాజమౌళి ప్లాన్ అదిరిపోయిందని అంటున్నారు. ఇక ఇప్పుడు ముగ్గురు హీరోలకు జంటగా నటించబోతున్న భామలు ఎవరా అనే ఆసక్తి నెలకొంది. అయితే రాజమౌళి ‘మహాభారత’ చేయబోతున్నట్లు చాలాసార్లు ప్రకటించినప్పటికీ ఇటీవల దీనిపై క్లారిటీ ఇవ్వడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఇక ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, బాహుబలి ప్రేక్షకుల ఊహాలకు మించి ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘మహాభారత’ ఏ రేంజ్‌లో ఉండబోతుందా? అని పలు చర్చలు జరుగుతున్నాయి.






