- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘త్రీ రోజెస్’ చాలా స్పెషల్.. హీరోయిన్ ఇంటర్వ్యూ వైరల్
ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు, రాశీ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ సీజన్ 2 ఈ నెల 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.

దిశ, సినిమా : ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు, రాశీ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ సీజన్ 2 ఈ నెల 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా.. కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు.కాగా"త్రీ రోజెస్" సీజన్ 2 హైలైట్స్ తెలిపారు హీరోయిన్ ఈషా రెబ్బా, యాక్టర్ హర్ష చెముడు. హీరోయిన్‌కు ఇంపార్టెన్స్ ఉండే మూవీస్ గతంలో చాలా తక్కువగా వచ్చేవి కానీ ఇప్పుడు వాటి సంఖ్య పెరిగిందని... ఫీమేల్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ వస్తే.. తనను అందులో రిలేట్ చేసుకోగలిగితే నటించేందుకు ఒప్పుకుంటానని తెలిపింది ఈషా. లాక్ డౌన్‌లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానని.. యాక్షన్ మూవీస్ లో అవకాశం వస్తే నటిస్తానని తెలిపింది.
ఇక ఈ సందర్భంగా మాట్లాడిన హర్ష చెముడు.. ‘‘త్రీ రోజెస్’ సీజన్ 1 కంటే సీజన్ 2 స్కేల్ పరంగా చాలా పెద్దది. మొదటి సీజన్ చేసినప్పుడు తక్కువ బడ్జెట్‌లో చేశారు. ఆ సీజన్ హిట్ అయ్యింది కాబట్టి సీజన్ 2 ఇంకా హ్యూజ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఎక్కువమంది ఆర్టిస్టులను పెట్టుకుని రూపొందించారు. ఇందులో కొన్ని అతిథి పాత్రలు కూడా వస్తుంటాయి. ‘త్రీ రోజెస్’ సీజన్ 1 లోని రివేంజ్‌ను ఈ సీజన్ 2లో తీర్చుకునేందుకు నేను ప్రయత్నిస్తుంటాను. ఈషా, నా క్యారెక్టర్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తాయి. మన తెలుగు వెబ్ సిరీస్‌లకు చూసుకుంటే ఇది పక్కా సీక్వెల్. వెబ్ సిరీస్‌లలో కొన్నింటికి ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కో డైరెక్టర్ ఉంటారు. మా సీజన్ 2కు కొత్త డైరెక్టర్ కిరణ్ వర్క్ చేశారు. అయితే రైటర్ అండ్ టీమ్ మారలేదు కాబట్టి అందరూ కోఆర్డినేషన్‌తోనే చేసుకున్నారు. సిరీస్ అంతా ఎంటర్ టైనింగ్‌గా సరదాగా ఉంటుంది. లైఫ్, రిలేషన్ షిప్స్, ఫ్రెండ్ షిప్ గురించి మంచి విషయాలు కూడా ఉంటాయి. అయితే అవి సందేశాలు ఇచ్చినట్లు చూపించలేదు’ అని తెలిపాడు.






