- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైరల్‌గా హీరోయిన్ రుక్మిణి వసంత్ మార్ఫింగ్ ఫొటోలు.. ముగ్గురు అరెస్ట్
హీరోయిన్ రుక్మిణి వసంత్‌కు సంబంధించిన ఫొటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

దిశ, సినిమా: సోషల్ మీడియా విస్తృతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో.. AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ కారణంగా అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా డీప్‌ఫేక్ టెక్నాలజీతో సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. ఇందులో నిజమైన ఫొటోలేవో, AI ద్వారా సృష్టించిన ఫొటోలు ఏవో తెలియనంతగా మార్ఫింగ్ చేస్తుండటంతో వాళ్ల వ్యక్తిగత భద్రతకు భంగం కలుగుతుందని పలువురు ప్రముఖులు ఆందోళన చెందుతూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనలో హీరోయిన్ రుక్మిణి వసంత్ బాధితురాలుగా మారింది. ఆమెకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రుక్మిణి వసంత్‌కు సంబంధించిన అభ్యంతరకరమైన ఫొటోలను, వీడియోలను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేసిన కేసులో బాగల్‌కోట్ జిల్లా చిలకముఖి గ్రామానికి చెందిన జి రవికుమార్ (24), బెంగళఊరులోని నాగసంద్ర మహాలక్ష్మి నగర్‌కు చెందిన ఆర్ రంజిత్ (25), శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకాకు చెందిన ఎల్ చంద్రకాంత్ (33)లను అరెస్టు చేశారు. నిందితులు ఉపయోగించిన మూడు ముబైల్ ఫోన్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.






