- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OTT: ఒకే రోజు మూడు సినిమాలు.. సినీ అభిమానులకు పండగే
ఈరోజు భర్త మహాశయులకు విజ్ఞప్తి, కపుల్ ఫ్రెండ్లీ, ఫంకీ సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్: ఈరోజు మూడు క్రేజీ తెలుగు సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఆ సినిమాలు ఏవి? ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి? అనే వివరాలు తెలుసుకుందాం.
భర్త మహాశయులకు విజ్ఞప్తి
మాస్ మహారాజా రవితేజ హీరోగా డింపుల్ హయాతి, ఆశిక రంగనాథ్ హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదలైంది. ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినా భారీ వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది. ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో అన్ని సినిమాల కంటే ఈ మూవీ ఆలస్యంగా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ఈరోజు నుండి ఈ చిత్రం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
కపుల్ ఫ్రెండ్లీ
సంతోష్ శోభన్ హీరోగా మానస వారణాసి హీరోయిన్గా తెరకెక్కిన ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఫంకీ
విశ్వక్ సెన్ హీరోగా కాయాదు లోహర్ హీరోయిన్గా అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయింది. ఈ మూవీ ఈరోజు నుండి 'నెట్‌ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతుంది.






