- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోరు పెంచిన సిద్ధు జొన్నలగడ్డ.. ఎన్ని సినిమాలు లైన్‌లో పెట్టాడంటే?
సోషియో ఫాంటసీతో పాటు మరో రెండు సినిమాలు లైన్‌లో పెట్టాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నల గడ్డ.

దిశ, సినిమా: ‘డీజే టిల్లు’తో టాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. తనదైన మేనరిజమ్, డైలాగ్ డెలివరీతో సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ మొదటి భాగం అంత హిట్ సొంతం చేసుకోలేదు. తర్వాత ‘తెలుసు కదా’ మూవీతో వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఇప్పుడు సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సిద్ధు.. తన లైనప్‌ను పూర్తిగా మార్చేసి మూడు భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ మేరకు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్‌జోతో చేతులు కలిపాడు. సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రం క్రైమ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. దీంతో పాటు సరికొత్త జానర్ సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇది గ్రాఫిక్స్, విజువల్ వండర్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అలాగే ప్రస్తుతం రవికాంత్ పేరేపు దర్శకత్వంలో ‘బాడాస్’ అనే ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాలో కూడా నటిస్తున్నాడు. ఇక టిల్లు క్యూబ్ పనులు కూడా ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తుండగా.. సిద్ధు లైనప్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.






