- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ స్టార్స్ సినిమాల్లో విలన్‌గా నటించాలని ఉంది.. టాలీవుడ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి(Adi pinishetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఒక ‘వి ’ చిత్రం’ సినిమాతో హీరోగా పరిచయం అయి తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి(Adi pinishetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఒక ‘వి ’ చిత్రం’ సినిమాతో హీరోగా పరిచయం అయి తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ ‘సరైనోడు’(Sarrainodu) మూవీలో విలన్ క్యారెక్టర్ పోషించి ఇంకా పాపులారిటీ తెచ్చుకున్నాడు. చెప్పాలంటే హీరోగా కంటే విలన్‌గానే ఎక్కువ ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్‌గా ‘శబ్దం’(Shabdham) మూవీతో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది పినిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘దర్శకుడు అరివజగన్ దర్శకత్వం వహించిన నా రెండో చిత్రం ఈరంలో నేను నటించాను. ఆ సమయంలో ఆయన ఆలోచనలు ప్రత్యేకమైనవి. ఇప్పుడు మేము మళ్ళీ కలిసి పని చేసినప్పుడు మాకు మంచి అవగాహన వచ్చింది. అరివజగన్ దర్శకత్వం, కథ పట్ల ఆయన చూపిన శ్రద్ధ అన్నీ నన్ను ఆకట్టుకుంటాయి.
నాకు తమిళ, తెలుగు చిత్రాల మధ్య తేడా లేదు. ఇక శబ్దం సినిమా తర్వాత, ‘మరగత నానయం-2’ తో సహా పలు తమిళ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. అయితే హీరోగా కాకుండా విలన్‌గా నటించడానికే నేను ఇష్టపడతాను. ఎందుకంటే విలన్ పాత్రలకు పరిమితులు తక్కువగా ఉంటాయి. ఆసక్తికరంగా ఉంటాయి. అజిత్(Ajith), విజయ్(Vijay) వంటి పెద్ద స్టార్స్ ముందు విలన్‌గా నటించాలనుకుంటున్నాను, కానీ స్క్రిప్ట్ దానిని నిర్ణయిస్తుంది' అని ఆది చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






