Akanksha Singh: ఆ జ్ఞాపకాలు నాతో ఎప్పటికీ నిలిచిపోతాయి.. యంగ్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-21 13:13:51  IST  )

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad), అర్చన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘షష్టిపూర్తి’(Shashtipurthi).

Akanksha Singh: ఆ జ్ఞాపకాలు నాతో ఎప్పటికీ నిలిచిపోతాయి.. యంగ్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad), అర్చన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘షష్టిపూర్తి’(Shashtipurthi). అయితే ఇందులో రూపేష్, ఆకాంక్ష సింగ్(Akanksha Singh) హీరోహీరోయిన్‌గా నటిస్తున్నారు. పవన్ ప్రభ(Pawan Prabha) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని మా అయి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపేష్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా మే 30న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆకాంక్ష సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘షష్టిపూర్తిలో, నేను జానకి అనే పాత్రను పోషిస్తున్నాను. ఇలాంటి కథలు నేడు చాలా అవసరం. నేను గ్రామీణ అమ్మాయి పాత్రను పోషించాను. ఇప్పటివరకు, నేను పూర్తి స్థాయి సాంప్రదాయ తెలుగు అమ్మాయిగా ఎప్పుడూ నటించలేదు. కరోనా వల్ల సినిమాలకు చాలా గ్యాప్ వచ్చింది.

చాలా రోజుల తర్వాత ఓ మంచి కథతో మీ ముందుకు వస్తున్నా. ఇళయరాజా గారి సంగీతం సినిమాకే హైలెట్. సినిమాలో నేను టెంపుల్ ట్రెజరర్‌గా కనిపిస్తాను. ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడాలి. షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి నాకు గుర్తుకు వచ్చారు. నేను ఆయనను చాలా మిస్ అయ్యాను. తల్లిదండ్రులతో ఎక్కువ సమయాన్ని గడపండి.. వారిని ప్రేమించండి. మా నిర్మాత రూపేష్ చాలా మంచి వ్యక్తి. మూవీస్ పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ ఈ చిత్రానికి న్యాయం చేశారు. అందరినీ ఒకతాటిపైకి తీసుకు వచ్చారు. ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించారు. మా దర్శకుడు పవన్‌కు ఓ క్లారిటీ, విజన్ ఉంది. ఆయనతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది.

గోదావరి ప్రాంతాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. మేము మండే ఎండలో చాలా కష్టపడి పని చేశాము. ఆ జ్ఞాపకాలు నాతో ఎప్పటికీ నిలిచిపోతాయి. నా కారెక్టర్‌లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. ‘షష్టి పూర్తి’ కోసం పని చేస్తుంటే నాకు యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లినట్టుగా అనిపించింది. ఓ మంచి నటిగా ఆడియన్స్ గుర్తు పెట్టుకోవాలని.. అందుకు తగ్గట్లుగానే మంచి రోల్స్, స్టోరీస్ ఎంచుకుంటూ వస్తున్నాను. అన్ని రకాల పాత్రలను, జానర్లను టచ్ చేయాలని ఉంది. నాకు యాక్షన్ చిత్రాలంటే ఎక్కువగా ఇష్టం. ప్రస్తుతం ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాను. తమిళంలో ఇంకో సినిమా చేస్తాను. నాని మూవీస్ అంటే చాలా ఇష్టం’’ అని చెప్పుకొచ్చింది.

Next Story