- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ సారి బొమ్మ అదిరిపోవాలంతే.. ఆ స్టార్ డైరెక్టర్‌తో సుహాస్ కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరంటే?
‘కలర్ ఫొటో’(Colour Photo) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయిన సుహాస్(Suhas) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: ‘కలర్ ఫొటో’(Colour Photo) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయిన సుహాస్(Suhas) మనందరికీ సుపరిచితమే. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్‌గా ‘జనక అయితే గనక’(Janaka Ayithe Ganaka) మూవీలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో సినిమాని అనౌన్స్ చేశాడు సుహాస్. గోపి(Gopi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్ పై నరేంద్ర రెడ్డి(Narendra Reddy) నిర్మిస్తున్నారు. అయితే నేడు పూజా కార్యక్రమాలతో స్టార్ అయిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫస్ట్ షాట్‌కు క్లాప్ కొట్టగా.. టాలెంటెడ్ హీరో సత్యదేవ్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. ఇక నిర్మాత వంశీ నందిపతి మొదటి షాట్‌కు దర్శకత్వం వహించారు.
అయితే ఈ మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో యంగ్ బ్యూటీ శివాని నాగరం( Shivani Nagaram)హీరోయిన్‌గా చేస్తుంది. ఇప్పటికే సుహాస్‌తో ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్’లో ఒకసారి నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు రెండోసారి కూడా రొమాన్స్ చేయబోతుంది. మరి మరోసారి వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుండటంతో బొమ్మ అదిరిపోతుందని అభిమానులు అంటున్నారు. అలాగే మళ్లీ ఎలాంటి స్టోరీతో రాబోతున్నారు అనే దానిపై క్యూరియాసిటీ నెలకొంది. ప్రస్తుతం పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ చిత్రంలో నటించబోతున్న యాక్టర్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






