Venkatesh: ఈ సారి తొడల్లో సిక్స్ ప్యాక్ చూపించాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన వెంకీ మామ

by Phanindra |   (  Updated:2025-08-02 15:10:02  IST  )

అలాంటివి నా వల్ల కాదు. అయిన ఈ సారి తొడల్లో సిక్స్ ప్యాక్ బాగానే చూపించానుగా

Venkatesh: ఈ సారి తొడల్లో సిక్స్ ప్యాక్ చూపించాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన వెంకీ మామ
X

దిశ, వెబ్ డెస్క్ : 2024 సంక్రాంతికి 'సైంధవ్‌' మూవీతో డిజాస్టర్ అందుకున్న వెంకటేష్.. ఈ సారి 'సంక్రాంతికి వస్తున్నాం' ( Sankranthiki Vasthunam ) సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్.. బాక్సాఫీస్ వద్ద మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఇక, నార్త్ అమెరికాలో కేవలం రెండు రోజుల్లోనే 1 మిలియన్ డాలర్ మార్క్ ను దాటింది. ఈ క్రమంలోనే మూవీ టీం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో సక్సెస్‌ మీట్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్ లో హీరో వెంకీ ఎమోషనల్ అయ్యారు.

హీరో వెంకీ ( Venkatesh ) మాట్లాడుతూ ''నాకు ఆన్ స్క్రీన్ మంచిగా అనిపిస్తుంది కానీ అందరి ముందు మైక్ పట్టుకుని మాట్లాడాలంటే కొంచం ఇబ్బందిగా ఉంటుంది. అనిల్ తో 'ఎఫ్ 4' మాత్రమే కాదు 'ఎఫ్ 10', 'సంక్రాంతికి వస్తున్నాం' ( Sankranthiki Vasthunam ) లాంటి హిట్ సినిమాలు చాలా చాలా వస్తాయి. మీరు ప్రేమగా అడిగితే మేమెందుకు ఇవ్వకుండా ఉంటాము. ఇప్పుడు 'ఘర్షణ' లాంటి సినిమాలు చేయాలంటే సిక్స్ ప్యాక్ లు చేయాలి .. అలాంటివి నా వల్ల కాదు. అయిన ఈ సారి తొడల్లో సిక్స్ ప్యాక్ బాగానే చూపించానుగా అంటూ నవ్వుతూ అన్నాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది వండర్ ఫుల్ మూమెంట్. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు రావడంతో నా మనసుకి సంతోషంగా ఉంది. మీడియా వారికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఫోన్లు చేసి అభినందించిన సినీ దోస్తులకు థ్యాంక్స్. ఒకరిద్దరు కాకుండా కుటుంబమంతా కలిసి వెళ్తున్నందుకు హ్యాపీగా ఉంది. మా చిన్నోడు మహేష్ బాబుకి థ్యాంక్యూ. సినిమా చూసి ట్వీట్ చేసారు''అంటూ వెంకీ తన సంతోషాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

Click For Video....

Next Story