Mangli : ఈసారి సిక్కోలులో పుడతాను : స్టార్ సింగర్ సెన్సేషనల్ స్టేట్మెంట్

by Muthe.Rajitha |

తనకు మళ్ళీ జన్మ ఉంటే శ్రీకాకుళం(Srikakulam)లో పుట్టాలని ఉందంటూ స్టార్ సింగర్ మంగ్లీ(Singer Mangli) తన మనసులో మాట బయట పెట్టారు.

Mangli : ఈసారి సిక్కోలులో పుడతాను : స్టార్ సింగర్ సెన్సేషనల్ స్టేట్మెంట్
X

దిశ, వెబ్ డెస్క్ : తనకు మళ్ళీ జన్మ ఉంటే శ్రీకాకుళం(Srikakulam)లో పుట్టాలని ఉందంటూ స్టార్ సింగర్ మంగ్లీ(Singer Mangli) తన మనసులో మాట బయట పెట్టారు. రథసప్తమి(Rathasaptami) వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలను రెండు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వేడుకల్లో పాల్గొన్న మంగ్లీ.. తన పాటలతో అందర్నీ ఉత్సాహపరిచారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) అన్న తనకు చెప్పినట్టు శ్రీకాకుళం పుణ్యభూమి అని కొనియాడారు. మళ్ళీ జన్మంటూ ఉంటే సిక్కోలులో పుడతాను అంటూ భావోద్వేగానికి గురయ్యింది. ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోనని అన్నారు.

ఇది తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అరసవెల్లి సూర్యనారాయణుని(Arasavelli SuryaNarayana) దర్శనం చేసుకున్నానని, ఈ వేడుకల్లో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సూర్యభగవానుడిపై అన్నమయ్య రాసిన కీర్తనను మంగ్లీ ఆలపించారు. ఫోక్ సాంగ్స్ తో తన పాటల కెరియర్ ను మొదలు పెట్టి, తెలుగు తమిళ సినిమాల్లో పాడుతూ మంచి గాయనిగా గుర్తింపు తెచ్చుకుంది మంగ్లీ. అలాగే తన యూట్యూబ్ చానెల్ ద్వారా ఎప్పటికప్పుడు తన కొత్త పాటలు అప్లోడ్ చేస్తూ.. శ్రోతలని ఉర్రూతలూగిస్తూ ఉంటుంది. మంగ్లీ పాడిన బతుకమ్మ పాటలు, బోనాల పాటలు, శివరాత్రి భక్తి గీతాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటాయి.

Next Story