క్లాస్ మాస్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఆస్వాదించేలా ఈ సినిమా ఉంటుంది: రామ్ నారాయణ్

by I. Sairam |

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen), రామ్ నారాయణ్(Ram Narayan) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’(Laila) .

క్లాస్ మాస్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఆస్వాదించేలా ఈ సినిమా ఉంటుంది: రామ్ నారాయణ్
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen), రామ్ నారాయణ్(Ram Narayan) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’(Laila) . ఈ సినిమాను షైన్ స్క్రీన్ పిక్చర్స్(Shine Screen Pictures), ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్(SMT Archana Presents) బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌డే సందర్భంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ఫస్ట్ టైం లేడీ గెటప్‌లో కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొన్నది.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని అప్డేట్స్ ఆకట్టుకున్నాయి. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్ల జోరులో ఉన్నారు మూవీ టీమ్.. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన డైరెక్టర్ రామ్ నారాయణ్ ఈ సినిమా పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘తొలి చిత్రం ‘బట్టల రామస్వామి’ బయోపిక్ విడుదల తర్వాత ఓ విభిన్నమైన కథని చెప్పాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు వచ్చిన ఓ ఆలోచనే లేడీ గెటప్‌లో కనిపించే హీరో కథ. ఈ నేపథ్యంలో కథలు ఈ మధ్యకాలంలో రాలేదు. కథ సిద్ధమయ్యాక ఈ పాత్ర కుదిరితే సినిమా అద్భుతంగా వస్తుందనే నమ్మకం కుదిరింది.

నాకు ఇష్టమైన పాత బస్తీ నేపథ్యంలో కథైతే పక్కాగా కుదిరింది. కానీ లేడీగా కనిపించే హీరో ఎవరనే ప్రశ్న దగ్గర మేము ఆగిపోయాము. ఈ పాత్ర చేయాలంటే చాలా ధైర్యం కావాలి. నిర్మాత సాహు గారపాటి(Sahu Garapati)కి బాగా నచ్చిన ఈ కథని, విశ్వక్‌కి చెప్పమని సూచించారు. మాస్ ఇమేజ్ ఉన్న విశ్వక్ ఈ కథని ఎలా తీసుకుంటారో అనే భయం ఉండేది. కానీ మా అదృష్టం కొద్ది ఆయనకి ఇలా లేడీ గెటప్‌తో సినిమా చేయాలనే కోరిక ఎప్పట్నుంచో ఉండేదట. ఇంతకు ముందు రెండు కథలు కూడా విన్నానన్నారు. ఆయన ఈ స్టోరీ వినగానే చాలా బాగా కనెక్ట్ అయ్యారు. క్లాస్ మాస్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఆస్వాదించేలా ఈ చిత్రం ఉంటుంది.

కథలో కానీ పాత్రలో కానీ అసభ్యత ఉండదు. కొంటెతనం మాత్రమే ఉంటుంది. విశ్వక్‌ని లేడీగా చూపించడం కోసం ఏఐ క్రియేషన్స్ మొదలు పెట్టి.. రకరకాల లుక్ టెస్ట్‌లు చేసి చూసుకోవడం వరకూ చాలా కసరత్తులే చేశాం. ‘రెమో’(Remo) సినిమాకి ప్రోస్తటిక్ చేసిన నిక్కిని సంప్రదించాము. విశ్వక్ లేడీ గెటప్‌లో చాలా బాగుంటారని చెప్పాక మాలో మరింత ఎనర్జీ పెరిగింది. లైలా పాత్రలోని కొంటెదనాన్ని లుక్‌తోనూ, తన నటనతో పక్కాగా తెరపైకి తీసుకొచ్చాడు విశ్వక్ సేన్. లేడీ గెటప్‌లో ఫస్ట్ టైం అతన్ని చూసి వాళ్ల కుటుంబ సభ్యులు చూసి ఆశ్చర్యపోయారు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రామ్ నారాయణ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story