Shanaya Kapoor: ప్రేమను అనుభూతి చెందండి అంటూ యంగ్ బ్యూటీ పోస్ట్.. కంగ్రాట్స్ అంటూ నెటిజన్ల కామెంట్స్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ షానయా కపూర్(Shanaya Kapoor) చాలాకాలంగా ఇండస్ట్రీలో రాణిస్తోంది.

Shanaya Kapoor: ప్రేమను అనుభూతి చెందండి అంటూ యంగ్ బ్యూటీ పోస్ట్.. కంగ్రాట్స్ అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ షానయా కపూర్(Shanaya Kapoor) చాలాకాలంగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. నటుడు అనీల్ కపూర్ సోదరుడు సంజ్య(Sanjay Kapoor) కుమార్తె షానయా కపూర్. ‘స్క్రూ డీలా’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత ‘బే దడక్’ నటించి మెప్పించింది. అంతేకాకుండా మోహన్‌లాల్(Mohanlal) హీరోగా నటించిన ‘వృషభ’ చిత్రంలోనూ నటించింది. అయితే ఈ మూవీ షూటింగ్ జరుపుకున్నప్పటికీ పలు కారణాల వల్ల వాయిదా పడినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా, షానయా కపూర్ మరో బంపర్ ఆఫర్ అందుకుంది.12th ఫెయిల్, సబర్మతీ రిపోర్ట్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్రాంత్ మస్సే(Vikrant Massey) సరసన నటించనుంది.

‘ఆంఖోంకి గుస్తాఖియాన్’ పేరుతో రాబోతున్న ఈ చిత్రాన్ని సంతోష్ సింగ్(Santosh Singh) తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో విక్రాంత్, షానయా జంటగా నటించబోతున్నారు. దీనిని జీ స్టూడియోస్, మిని ఫిల్మ్స్ ప్రజెంట్స్ బ్యానర్‌పై ఉమేష్ భన్సాలీ, వరుణ్, విశాల్ మిశ్రా నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ‘ఆంఖోంకి గుస్తాఖియాన్’ విడుదలకు సిద్ధం అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ షానయా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. ఈ మూవీ జూలై 11న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు తెలుపుతూ ‘‘ఈ వర్షాకాలంలో పడటమే కాదు, ప్రేమను అనుభూతి చెందండి’’ అనే క్యాప్షన్ జత చేసింది. కంగ్రాట్స్ డార్లింగ్ మా నీరిక్షణ ఇప్పటికే ముగిసింది అని కామెంట్లు చేస్తున్నారు.

Next Story