- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
8 గంటలే వర్క్ చేస్తాను అనడానికి ఇదేమి వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీ కాదు: రానా దగ్గుబాటి
ఆ జీవనశైలిలో మీరు కొనసాగాలా వద్దా అనేది పూర్తిగా మీ ఇష్టంపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది.

దిశ, సినిమా: దగ్గుబాటి రానా ఒకవైపు వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు నిర్మాతగా కూడా క్రేజీ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. కేవలం హీరోగానే కాకుండా, కథ డిమాండ్ చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, నెగెటివ్ పాత్రల్లో నటించడానికి కూడా ఆయన ఎప్పుడూ వెనుకాడరు. ఇటీవల ‘కాంత’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా, తన నటనతో అలరించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పెద్ద హిట్ అయితే అందుకోలేకపోయారు. ఇదిలా ఉంటే, తాజాగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా పరిశ్రమ పనితీరు గురించి రానా మాట్లాడుతూ.. "సినిమా అనేది కేవలం ఉద్యోగం లాంటిది కాదు.
అది ఒక లైఫ్‌స్టైల్. ఆ జీవనశైలిలో మీరు కొనసాగాలా వద్దా అనేది పూర్తిగా మీ ఇష్టంపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రతి సినిమా కూడా మేకర్స్ నుండి, నటీనటుల నుండి ఇంకేదో ఒక కొత్త విషయాన్ని ఆశిస్తూనే ఉంటుంది. కేవలం ఎనిమిది గంటలు పని చేస్తే ఒక అత్యుత్తమమైన సన్నివేశం వచ్చేస్తుందని అనుకోవడానికి ఇదేమీ వస్తువులను తయారుచేసే ఫ్యాక్టరీ కాదు" అని రానా స్పష్టం చేశారు.సినిమా షూటింగ్స్ పడే కష్టం గురించి మరింత వివరిస్తూ.. "కొన్నిసార్లు మనం సెట్స్‌పై వరుసగా 15 గంటల పాటు కష్టపడి షూటింగ్ చేసినా కూడా, ఆశించిన స్థాయిలో ఒక్క మంచి సీన్ కూడా రాకపోవచ్చు. సినిమా అనేది పూర్తిగా మనం చేసే ప్రాజెక్ట్‌ను బట్టి, అందులోని సిట్యుయేషన్లను బట్టి మారుతూ ఉంటుంది" అని రానా చెప్పుకొచ్చారు.






