మంచు ఫ్యామిలీలో వివాదాలపై మనోజ్ షాకింగ్ కామెంట్స్.. నెట్టింట మళ్లీ మొదలైన రచ్చ

by Mallepaka Hamsa |

ఆ ప్రశ్న ఎవరిని అడగాలో మీకు బాగా తెలుసుగా? అక్కడికే వెళ్లి అడగండి. కానీ, వెళ్లేటప్పుడు మైక్ పట్టుకుని మాత్రం వెళ్లొద్దు.. తలకు మంచి హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి

మంచు ఫ్యామిలీలో వివాదాలపై మనోజ్ షాకింగ్ కామెంట్స్.. నెట్టింట మళ్లీ మొదలైన రచ్చ
X

దిశ, సినిమా: మంచు ఫ్యామిలీలో గత కొద్దికాలంగా అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ఆస్తి వివాదాలు, మనస్పర్థలు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ గొడవల కారణంగానే మనోజ్ తన భార్యాపిల్లలను తీసుకుని వేరుగా ఉంటున్నారు. గతంలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం, గొడవపడటం వంటి విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగావైరల్ అయ్యాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరు హీరోలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూ సైలెంట్‌గా ఉండటంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని అందరూ భావించారు. ఈక్రమంలో.. తాజాగా మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఈ గొడవలు ఇంకా ముగిసిపోలేదనిహింట్ ఇస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో పాల్గొన్న మంచు మనోజ్‌కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది..

ప్రస్తుతం మీ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయినట్టేనా? అని ఓ జర్నలిస్ట్ అడగ్గా.. దానికి మనోజ్ నవ్వుతూ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మనోజ్ స్పందిస్తూ.. "ఆ ప్రశ్న ఎవరిని అడగాలో మీకు బాగా తెలుసుగా? అక్కడికే వెళ్లి అడగండి. కానీ, వెళ్లేటప్పుడు మైక్ పట్టుకుని మాత్రం వెళ్లొద్దు.. తలకు మంచి హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి" అంటూ నవ్వుతూ చెప్పారు. మంచు మనోజ్ సరదాగా నవ్వుతూనే తన అన్న మంచు విష్ణును ఉద్దేశించి ఈ షాకింగ్ కామెంట్స్ చేయడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన వారంతా మంచు అన్నదమ్ముల మధ్య వివాదాలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయని, ఇప్పట్లో ఇవి సర్దుమణిగేలా కనిపించడం లేదని చర్చించుకుంటున్నారు.

Next Story