- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Renu Desai: అందుకే నేను మనుషులను ద్వేషిస్తాను.. రేణు దేశాయ్ పోస్ట్
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) గత కొన్నేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది.

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) గత కొన్నేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. మళ్లీ రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’(Tiger Nageswara Rao) మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ హిట్ కాకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయింది. ఇక గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటూ జంతువులు, అనాధ పిల్లలకు తనవంతు సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటుంది. అంతేకాకుండా జంతువుల(Animals) కోసం ఇటీవల ఆద్య పేరుతో ఓ చారిటబుల్ ట్రస్ట్‌కూడా ఏర్పాడు చేసింది. నిత్యం జంతువులపై జరిగే దాడుల గురించి నెట్టింట చర్చిస్తూ అందరి మనసులు దోచేస్తుంది.
తాజాగా, రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ఓ నోట్ షేర్ చేసింది. ‘‘ఫెలిసెట్ అనే పిల్లిని అంతరిక్షంలోకి పంపించారు. వారాలపాటు చిత్రహింసలకు గురి చేశారు. అక్కడ కదలలేని గట్టి కంటైనర్లలో కూర్చోబెట్టారు. అంతేకాకుండా శరీరంలో ఎలక్ట్రోడ్‌ల(Electrodes)ను అమర్చాచు. వాటన్నింటినీ తట్టుకుని అంతరిక్షానికి వెళ్లిన తర్వాత కూడా 2 నెలల పాటు ప్రయోగాలకు ఉపయోగించి పడుకునేలా చేశారు. నేను మనుషులను ద్వేషిస్తాను అని చెప్పడానికి కారణం ఇదే’’ అని రాసుకొచ్చింది. అలాగే ఆ పిల్లి ఫొటో(Photo)ను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం రేణు దేశాయ్ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. జంతు ప్రేమికులు ఆమెకు సపోర్ట్‌గా ఉంటూ సూపర్ అని అంటున్నారు.






