Vinayak: అఖిల్ ఫ్లాప్ గురించి చిరంజీవి గారు అలా అన్నారు

by Pulgam srinivas |

వి. వి. వినాయక్ మాట్లాడుతూ.. అఖిల్ మొదటి సినిమాకి నువ్వు చాలా పెద్ద ఎక్స్‌పెరిమెంట్ చేశావు, అలాంటి రిస్క్ చేసి ఉండాల్సింది కాదు అని చిరంజీవి సలహా ఇచ్చినట్లు వినాయక్ చెప్పుకొచ్చారు.

Vinayak: అఖిల్ ఫ్లాప్ గురించి చిరంజీవి గారు అలా అన్నారు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో వి.వి. వినాయక్ ఒకరు. ఈయన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఆది అనే చిత్రంతో దర్శకుడిగా కెరీర్ను ప్రారంభించి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రంతో ఈయనకు మాస్ దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన కాస్త రూట్ మార్చి దిల్ అనే మూవీతో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఇలా రెండు విజయాలను అందుకోవడంతో ఈయన తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత కూడా చాలా సంవత్సరాల పాటు అదే స్థాయిలో కెరీర్ను కొనసాగించాడు. కానీ ప్రస్తుతం మాత్రం ఈ దర్శకుడికి పెద్దగా విజయాలు దక్కడం లేదు. కొంతకాలం క్రితం ఈయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి అనే చిత్రాన్ని రూపొందించాడు. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. కొన్ని సంవత్సరాల క్రితం వినాయక్, అక్కినేని అఖిల్ హీరోగా అఖిల్ అనే చిత్రాన్ని రూపొందించాడు.

ఈ మూవీ ప్లాప్ అయ్యింది. ఈ సినిమా ఫెయిల్యూర్ అయ్యాక చిరంజీవి ఏమన్నారనే విషయాలను ఆయన తెలియజేశారు. వినాయక్ మాట్లాడుతూ... అఖిల్ సినిమా మేము అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. సినిమా రిజల్ట్ వచ్చాక ఒకసారి చిరంజీవి గారిని కలిశాను. ఆయన ఆ సందర్భంలో 'అఖిల్ అదే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అలాంటి నటుడితో చాలా పెద్ద స్కేల్ మూవీ చేశావు. అలాంటి సినిమా చాలా రిస్క్. అలాంటి సబ్జెక్టు నువ్వు టచ్ చేసి ఉండాల్సింది కాదు' అని ఆయన సలహా ఇచ్చినట్లు ఈయన చెప్పుకొచ్చాడు.

Next Story