- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై విజయ్ దేవరకొండ రియాక్షన్ ఇదే.. ఆ పదాలు వినపడకూడదంటూ ట్వీట్
ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో భారత్‌కు చెందిన 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో భారత్‌కు చెందిన 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అక్కడి అందమైన ప్రదేశాలను చూసేందుకు వెళ్లిన వారిని దారుణంగా చంపేశారు. అయితే పహల్గాం దాడికి ఆపరేషర్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు భారత్ బదులివ్వనుంది. ఇప్పటికే ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడులు జరిగాయని న్యూ ఇండియాను చూస్తారని కూడా వార్నింగ్ ఇచ్చారు. గత రెండు రోజులనుంచ ఎక్కడ చూసిన ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి. ఇక ఈ విషయంపై యావత్ భారతీయులు స్పందిస్తూ తమ అభ్రిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నాయి. అదే విధంగా ఈ విషయంపై సినీ సెలబ్రిటీలు సైతం స్పందిస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు.
ఇప్పటికే ఎంతోమంది తమ అభిప్రాయాన్ని తెలియజేసిన విషయం తెలిసిందే. తాజాగా, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ట్విట్టర్ ద్వారా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ‘‘ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దేశంలోని మన సైనికులు, మహిళలు, అమాయక ప్రజలందరి భద్రత కోసం నేను ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తులో ఉగ్రవాదం, దాడులు అనే పదాలు వినిపించని ఒక కొత్త శకం కోసం మనమందరం ఎదురుచూస్తున్నాం. ప్రతి ఒక్కరూ తమ జీవితాలను స్వేచ్ఛగా గడపాలని ఆశిస్తున్నాను. అందరూ శాంతి యుతంగా, సుసంపన్నంగా, ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాము. జై హింద్.. ఆపరేషన్ సిందూర్’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






