ప్రదీప్ రంగనాథన్‌తో రొమాన్స్ చేయబోతున్న యంగ్ బ్యూటీ.. నగ్నంగా ఉన్న పోస్టర్ విడుదల చేయడంతో నెటిజన్ల రియాక్షన్ ఇదే!

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-11 09:47:10  IST  )

'లవ్ టుడే'(Love Today) ఫేం ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) లేటెస్ట్‌గా 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీతో మంచి సెక్సెస్ అందుకున్నారు.

ప్రదీప్ రంగనాథన్‌తో రొమాన్స్ చేయబోతున్న యంగ్ బ్యూటీ.. నగ్నంగా ఉన్న పోస్టర్ విడుదల చేయడంతో నెటిజన్ల రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: 'లవ్ టుడే'(Love Today) ఫేం ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) లేటెస్ట్‌గా 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీతో మంచి సెక్సెస్ అందుకున్నారు. ఇదే జోష్‌తో ఆయన తన నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా లెవల్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇక కీర్తిశ్వరన్(Keerthi Swaran) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాకు రీసెంట్‌గానే ‘డ్యూడ్’(Dude) అనే టైటిల్‌ను కన్ఫార్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ప్రేమలు ఫేమ్ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా దీపావళికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సాయి అభ్యాంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. ప్రదీప్ రంగనాథన్ షర్ట్ లేకుండా కనిపించాడు. ఆమె పక్కనే మమిత బైజు ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకుని కళ్లజోడుని కొంచెం కిందకి జరిపి ప్రదీప్‌నే చూస్తుంది. కానీ రంగనాథన్ మాత్రం కారుకు ఆనుకొని కామెడీగా చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంది.

Next Story