- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Niharika: అత్యంత సంతోషకరమైన రోజు ఇదే.. మెగా డాటర్ పోస్ట్‌తో నెటిజన్లు షాక్!
మెగా డాటర్ నిహారిక(Niharika Konidela) అందరికీ సుపరిచితమే. ఆమె మొదట యాంకర్‌గా బుల్లితెరకు పరిచయం అయింది.

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక(Niharika Konidela) అందరికీ సుపరిచితమే. ఆమె మొదట యాంకర్‌గా బుల్లితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. పలు చిత్రాల్లో నటించిన ఆమె హిట్స్ సాధించలేకపోయింది. అయినప్పటికీ నిహారికకు ఫుల్ పాపులారిటీ దక్కింది. ఈక్రమంలోనే ఆమె జొన్నలగడ్డ చైతన్య(Jonnalagadda Chaitanya)ను పెళ్లి చేసుకుంది. దీంతో కొద్ది రోజులపాటు సినిమాలకు దూరం అయింది. ఇక ఆమె భర్తతో కొద్ది కాలానికే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయింది. ఈక్రమంలోనే మళ్లీ నిహారిక సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. నిర్మాతగా మారి ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu)చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ మూవీ థియేటర్స్‌లో విడుదలై ఊహించని విధంగా హిట్ కావడంతో పాటు అత్యధిక కలెక్షన్లు రాబట్టింది.
దీంతో అదే ఫామ్‌లో నిహారిక హీరోయిన్‌గానూ ఓ సినిమా చేసింది. కానీ విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు పలు చిత్రాలు నిర్మిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా, నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ఓ చిన్నబాబును ఎత్తుకున్న ఫొటో షేర్ చేస్తూ ‘‘అత్యంత సంతోషకరమైన రోజు అది’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఆ బాబుతో ఎంతో ఆనందంగా ఉన్నా ఆమె ముసిముసి నవ్వులతో కనిపించింది. ఇక అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆ బాబు ఎవరి కొడుకు..అనే సందేహా పడుతున్నారు. మరికొందరు మాత్రం తన కొడుకే కావచ్చు అని అనుమానపడుతున్నారు. అయితే మెగా అభిమానులు మాత్రం ఎత్తుకుని ప్రేమ చూపించినంత మాత్రాన కొడుకు అనేస్తారా? అని మండిపడుతున్నారు.






