- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియన్ సినిమా చరిత్రలోనే ఆదే తొలిసారి.. ఏఐ టెక్నాలజీతో సాంగ్.. ఎందులోనంటే!
అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో నేటి మన సినిమాలు హాలీవుడ్ సినిమాలతో పోటీపడుతున్నాయి.

దిశ, సినిమా: అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో నేటి మన సినిమాలు హాలీవుడ్ సినిమాలతో పోటీపడుతున్నాయి. ప్రేక్షకులు కంటెంట్‌తో పాటు తమను అబ్బురపరిచే సాంకేతిక పరిజ్ఞానం వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. అందుకే మన దర్శక నిర్మాతలు ఎప్పటికప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని మన సినిమాల్లో వాడుతుంటారు. తాజాగా, ఇలాంటి ఓ సరికొత్త ప్రయోగం చేసింది ‘టుక్ టుక్’ మూవీ టీమ్. తొలిసారిగా ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో ఓ పాటను చిత్రీకరించారు. ఇది ఇండియన్ సినిమాలోనే తొలిసారి. ‘ఏలా అల తీపికోరే పూలతోట’ అని కొనసాగే ఈపాట విజులవ్స్ ఏఐ టెక్నాలజీతో ఎంతో అందంగా, స్టనింగ్ విజువల్స్ బ్యూటీఫుల్‌గా జనరేట్ చేశారు. హర్ష రోషన్(Harsha Roshan), కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు,సాన్వీ మేఘన, నిఖిల్ కోదాటి(Nikhil Kodati) ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి.సుప్రీత్ కృష్ణ(Supreet Krishna) దర్శకుడు.
చిత్రవాహిని, ఆర్ వై జి సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి(Rahul Reddy), లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి(Sriramula Reddy), సుప్రీత్ సి కృష్ణలు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. కాగా ఈ సినిమాను మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు మేకర్స్. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఏ ఐ టెక్నాలజీతో పాటను చిత్రీకరించడం ఎంతో ఆనందంగా ఉంది. తప్పకుండా థియేటర్‌లో ఆడియన్స్ ఈ పాటను ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి టెక్నాలజీని సినిమాల్లో తొలిసారిగా మా సినిమాకు వాడటం గర్వంగా ఉంది. సినిమా కూడా ఓ న్యూకాన్పెప్ట్‌లో ఉంటుంది. ఫాంటసీతో పాటు కొన్ని మ్యాజికల్ ఎలిమెంట్స్ చిత్రంలో ఉంటాయి. అవి ఆడియన్స్‌కు థ్రిల్ల్‌ను కలిగిస్తాయి. ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న ఈ చిత్రం అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
Read Also..






