- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tragedy:ప్రముఖ నటుడు మృతి.. 40 ఏళ్ల వయసులో మరణానికి కారణం ఇదే?
by Jakkula.Mamatha |
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది.

X
దిశ,వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు(Tamil actor) జయశీలన్(40) అనారోగ్య కారణాలతో మరణించారు. జాండీస్ సోకడంతో గత రెండు నెలలుగా చెన్నైలోని స్టాన్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇతడు విజయ్‌తో బిగిల్, విజయ్ సేతుపతితో విక్రమ్ వేద, ధనుష్‌తో పుదుపేట్టై సినిమాల్లో సహాయనటుడిగా నటించారు. ఇతడు తన సినీ కెరీర్‌లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన అంత్యక్రియలు వణ్ణారపేటలోని ఆయన నివాసంలోజరుగుతాయని సమాచారం. జయశీలన్(Jayaseelan) కి చాలా మంది హీరోలతో మంచి రిలేషన్ ఉంది. జయశీలన్ ఎలాంటి వివాదాల జోలికి వెళ్లని నటుడని పలువురు తెలిపారు. 40 ఏళ్ల నటుడు జయశీలన్ మరణం ఆయన కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
Next Story






