- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rashmika Mandanna: విజయ్ దేవరకొండ ‘VD-12’ టీజర్‌పై రష్మిక రియాక్షన్ ఇదే! (పోస్ట్)
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘VD-12’ .

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘VD-12’. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Naga Vamsi) నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, ‘VD-12’ టైటిల్, టీజర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు ‘కింగ్‌డమ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ ఈ చిత్రం టీజర్‌కు తెలుగులో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించగా.. తమిళంలో సూర్య, హిందీలో రణ్‌బీర్ కపూర్ తన వాయిస్ ఇచ్చారు. దీంతో ప్రేక్షకుల్లో ‘కింగ్‌డైమ్’మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక రిలీజ్ అయిన టీజర్‌లో ఎన్టీఆర్ వాయిస్ అందరిలో గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
అలాగే ‘‘ఇంత బీభత్సం ఎవరి కోసం. అసలీ వినాశనం ఎవరి కోసం.. రణ భూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మ నెత్తిన నాయకుడి కోసం’’ ఆయన చెప్పిన డైలాగ్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇక ఈ టీజర్‌కు నెటిజన్లు, అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. ‘కింగ్‌డమ్’ టీజర్ గూస్‌బంప్స్ తెప్పిస్తోందని సమంత(Samantha) పోస్ట్ పెట్టగా.. రష్మిక(Rashmika Mandanna) ‘‘ఈ వ్యక్తి ప్రతిసారి ఏదో ఒక అద్భుతం తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంటాడు’’ అనే క్యాప్షన్ జత చేసి హార్ట్ సింబల్స్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో అంతా ప్రేమికులంటే మీ లాగా ఉండాలని చర్చించుకుంటున్నారు.
కాగా, విజయ్, రష్మిక గత కొద్ది రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరు వెకేషన్స్‌కు వెళ్తున్న ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. రష్మిక, విజయ్ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటించి ప్రేమికులుగా మారిపోయినట్లు తెలుస్తోంది. వివిధ సందర్భాల్లో కలిసి కనిపించడంతో పాటు నిత్యం తాము ప్రేమలో ఉన్నట్లు హింట్స్ ఇస్తుంటారు. వీరిద్దరు ప్రేమను కన్ఫర్మ్ చేసే ప్రూఫ్‌లు కూడా ఎన్నోసార్లు బయట పడ్డాయి. అయినప్పటికీ ఈ జంట మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇక రష్మిక ‘కింగ్‌డమ్’ టీజర్ వచ్చిన నిమిషాల్లోనే స్పందించడంతో అంతా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఫిక్స్ అయిపోయారు.






