- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rashmika Mandanna: ఇది చాలా సూపర్ స్పెషల్ డే.. షాకింగ్ పోస్ట్ పెట్టిన రష్మిక మందన్న (వీడియో)
టాలీవుడ్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా చిత్రాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకుంటూ తన పాపులారిటీని పెంచుకుంటుంది. 2023 ‘యానిమల్’(Animal) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది. ఇక గత ఏడాది రష్మిక నటించిన ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మంత్రముగ్దులను చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఇటీవల ఈ అమ్మడు నటించిన ‘ఛావా’ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ మూవీ ఊహించని రేంజ్‌లో కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది.
అయితే రష్మికకు ఛావా విడుదలకు ముందే గాయం అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రమోషన్స్‌కు కూడా దూరం అయి చికిత్స తీసుకుంటుంది. కానీ వరుస పోస్టులు పెడుతూ తన సినిమా హిట్ అయ్యేలా చేసుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, రష్మిక మందన్న ఓ షాకింగ్ వీడియోను షేర్ చేసింది. ‘‘నేను ఆలస్యం అయ్యానని నాకు తెలుసు. కానీ ఛావా ప్రమోషన్‌కు సంబంధించిన చాలా ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. నేను ఇప్పటికీ షేర్ చేయలేదు.. నేను ఇప్పుడు వాటిని పంచుకోవాలని అనుకుంటున్నాను. అది సరేనని నేను ఆశిస్తున్నాను. ఇది ఈ సూపర్ స్పెషల్ డే. ఛావా సజీవంగా రావడాన్ని చూశారు’’ అని రాసుకొచ్చింది. అలాగే ఆమె వీల్ చైర్‌లో ఉన్న వీడియోను షేర్ చేయడంతో ఇంకా ఆమెకు గాయం తగ్గలేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం రష్మిక మందన్న కుబేరా, ది గర్ల్‌ఫ్రెండ్(The Girlfriend), సికందర్(Sikander) సినిమాల్లో నటిస్తుంది.






